. . . శాస్త్రీయ ఆలోచన ఎంతో అవసరం
. . . సమాజాన్ని చైతన్యం చేయడంలో విద్యార్థులే ముందుండాలి
. . . పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో పిడిఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్క గణేష్ అధ్యక్షతన రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. రాజకీయ శిక్షణ తరగతులకు సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ప్రారంభ ఉపన్యాసకులుగా మాట్లాడినారు. నర్రా రామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, జీవ పరినామం సిద్ధాంతం అనే అంశంపై బోదిస్తూ జీవపరిణామ సిద్ధాంతం ద్వారా ప్రపంచంలోని జీవజాతులు ఎలా అభివృద్ధి చెందాయో, ప్రకృతి మార్పులకు అనుగుణంగా జీవులు ఎలా రూపాంతరం చెందాయో వివరించారన్నారు.

మూఢనమ్మకాలకంటే శాస్త్రీయ ఆలోచన ఎంతో అవసరమని, సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారన్నారు. పౌర హక్కుల సంఘం (సీఎల్ సి) రాష్ట్ర కోశాధికారి ఆల్గోట్ రవీందర్ గతితార్కిక భౌతిక వాదం అంశంపై బోధిస్తూ సమాజంలో జరిగే మార్పులు, విరుద్ధ శక్తుల మధ్య పోరాటం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, గతితార్కిక భౌతిక వాదం వివరిస్తుందని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా, తార్కికంగా విశ్లేషించే దృక్పథం విద్యార్థుల్లో పెరగాలని సూచించారు. పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ పీడీఎస్ యు చరిత్రను వివరిస్తూ, విద్యార్థుల హక్కుల సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యా సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్ యు ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన చరిత్రను వివరించారు. ఫీజుల పెంపు, ప్రైవేటీకరణ, నిరుద్యోగం వంటి సమస్యలపై విద్యార్థి ఉద్యమాల అవసరాన్ని చర్చించారు. పీడీఎస్ యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎం. సుధాకర్ నిర్మాణం పని పద్ధతుల గురించి వివరిస్తూ విద్యార్థి సంఘం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్మించబడే పోరాట వేదిక అని వివరించారు. విద్యార్థుల సమస్యలను గుర్తించడం, సంఘటితం చేయడం, ఆందోళనలు నిర్వహించడం, విద్యార్థి హక్కుల కోసం నిరంతరం పోరాడటం సంఘం ప్రధాన బాధ్యతలని తెలియజేశారు. ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులు సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు అశుర్ నసీర్,వైష్ణవి,నితిన్, జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, పివైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.నవీన్, సాయిబాబా,మహేష్,జిల్లా నాయకులు మణితేజ, దీపిక,మున్నా,జీవన్, మహేందర్,హేమాంజలి, అరవింద్, బన్నీ,జీవన్,రాంచందర్,మమత,తార చంద్,ప్రభాకర్,అరవింద్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
