. . . మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే హైమద్ అబ్దుల్ బాలాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మైనార్టీ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మలక్ పేట్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంఐఏం పార్టి ఇంచార్జీ హైమద్ అబ్దుల్ బాలాల అన్నారు. బిన్ జియాద్ అల్-ముస్లిమీన్ మిలాద్-ఉన్-నబి పౌండేషన్ ద్వారా పేద పిల్లలకు పదో తరగతి అల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేశారు. నగరంలోని బ్లూ డైమండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మలక్ పేట్ శాసనసభ్యులు హైమద్ అబ్దుల్ బలాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఉర్దూ మీడియం పిల్లలందరికీ మజ్లిస్-ఎ-యాద్-ఉల్-ముస్లిమీన్ ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తాయన్నారు. ఈ విషయాలన్నింటి ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తు కోసం కష్టపడిచదవులని అన్నారు. విద్యార్థులందరూ పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ మోడల్ పుస్తకం నుండి కాకుండా ఏ ఒక్క ప్రశ్న కూడా వేరే పుస్తకం నుంచి మీకు రాదన్నారు. మీరు బాగా చదువుకుంటే అన్ని సబ్జెక్టులపై అవగాహన కలుగుతుందన్నారు. మంచి మార్కులతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మజ్లిస్ మీ పార్టీ, మీ కుటుంబం, పిల్లలు, పెద్దల పట్ల కూడా బాధ్యత ఉందని,ఎల్లప్పుడూ మజ్లిస్‌తో కనెక్ట్ అయి ఉండాలన్నారు. మన కోసం, మైనారిటీల కోసం, భారతదేశంలోని బలహీన వర్గాల కోసం, ముస్లిం యూనిటీ కౌన్సిల్ నుండి మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ అసదుద్దీన్ ఓవైసీ కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఓటర్లుగా మారే పిల్లలలో రాజకీయ అవగాహన పెంచడానికి పుస్తకాలు ఉపయోగపడుతాయన్నారు. మన గ్రామాల్లో రాజకీయ అవగాహన కలిగి ఉండటం ముఖ్యమన్నారు. సమావేశం అనంతరం నగరంలోని వీక్లీ మార్కెట్ లో కూరగాయలు విక్రయించడానికి పోలీసులు అనుమతించకపోవడంతో ఎంఐఎం పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీకి విషయం చెప్పగా పోలీసులతో మాట్లాడి తిరిగి వీక్లీ మార్కెట్ లో విక్రయాలు జరిపించడంతో వారు ఎమ్మెల్యే హైమద్ బలాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఉద్దీన్, నగర అధ్యక్షులు షకీల్ హైమద్, డిప్యూటీ మేయర్ ఇద్రిష్ ఖాన్, కోఆప్షన్ మెంబర్ షబాష్ అహ్మద్, కార్పొరేటర్లు మునావర్ ఆలీ, రియజ్ అహ్మద్,ముస్తహిసిన్, అబ్దుల్ ఆలీ బాగ్ బాన్, అర్షద్ పాషా, ఆలీం పియా, సోహెల్ చావూష్ తదతరులు పాల్గొన్నారు.
