Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 1:44 pm Posted by : ramakrishna

విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
  • విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
  • కళాశాల యాజమాన్యం విద్యార్థుల నడవడికను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి
  • విద్యార్థులు సీనియర్స్-జూనియర్స్ అనే తేడాలు లేకుండా స్నేహపూర్వకంగా చదువు కొనసాగించాలి
  • జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నా జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని,చారవణిలో ఆకట్టుకునే ప్రకటనలు చూసి అత్యాశకు పోయి సైబర్ మోసగాల్లో వలలో చిక్కుకోవద్దన్నారు. విద్యార్థులలో సైబర్ నెరలపై చైతన్యం తీసుకరవలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని విద్యాసంస్థలలో సైబర్ వారియర్ల చేత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియను వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలిపారు.సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయాలని భయపడవద్దని తెలిపారు.
విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ తొలి దశలోనే కట్టడి చేయాలని,ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు విద్యార్థుల నడవడికను గకనిస్తూ ఉండాలని తెలిపారు.కళాశాల ఆవరణలో సీనియర్స్-జూనియర్స్ అనే తేడాలు లేకుండా స్నేహపూర్వకంగా చదువు కొనసాగించాలని ర్యాగింగ్ కు దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల లకు అలవాటుపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాలని,గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీస్ వారికి అందివ్వాలని తెలిపారు. విద్యార్థులు చేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని,కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సైబర్ సెల్ ఆర్.ఎస్.ఐ జునైద్, కళశాల ప్రిన్సిపాల్ జగన్, కళశాల యాజమాన్యం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Students should be vigilant about cybercrime