. . . తహశీల్దార్ తారాబాయి
రుద్రూర్, బతుకమ్మ :
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశానుసారం రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలోని ఎంపీ యుపిఎస్ ప్రైమరీ పాఠశాలను మంగళవారం తహశీల్దార్ తారాబాయి సందర్శించారు. పాఠశాలలోని మూడవ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, ఈ సబ్జెక్టులపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా శ్రద్ధగా బోధించాలని ప్రధానోపాధ్యాయుడికి తహశీల్దార్ సూచించారు.