విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
ఎంపీడీవో బషీరుద్దీన్ బాన్సువాడ, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో బషీరుద్దీన్ అన్నారు. మండలంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆహార వస్తువులను, బియ్యాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శులు సృజన్ రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.