Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 5:26 pm Posted by : ramakrishna

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

ఎంపీడీవో బషీరుద్దీన్ 

 

బాన్సువాడ, బతుకమ్మ  : విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో బషీరుద్దీన్ అన్నారు. మండలంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆహార వస్తువులను, బియ్యాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శులు సృజన్ రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.