విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

 పిట్లం, బతుకమ్మ  : పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎంఈవో దేవి సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు.  ప్రాథమికోన్నత పాఠశాల మద్దెల చెరువు , ప్రాథమిక పాఠశాల బండాపల్లి పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాల లో నమోదైన పిల్లల సంఖ్య , హాజరు, టీచర్ల హాజరు పరిశీలించారు. బేస్ లైన్ టెస్ట్ వివరాలు, ఆన్లైన్ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మద్దెల చెరువు పాఠశాల...