విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపేట్, బతుకమ్మ : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. లింగంపేట రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైసరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పని చేసి, విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు. వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు....