Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 5:15 pm Posted by : ramakrishna

విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి

  • ఎమ్మెల్యే మదన్ మోహన్

 

లింగంపేట్, బతుకమ్మ : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. లింగంపేట రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైసరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పని చేసి, విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు. వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు నూతన యూనిఫార్ములను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, హాస్టల్ అడ్వైసరీ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Students should be provided with better facilities