విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి
. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రతి అధ్యాపకుడు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ, వారిని భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ శిక్షణా తరగతులు వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు...