Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 7:41 pm Posted by : ramakrishna

విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కలిగించాలి

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సీపీఆర్ పై అవగాహన కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమానికి చెందిన మొబైల్ హెల్త్ టీం సిబ్బందికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) పై సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కే మొబైల్ హెల్త్ టీం సిబ్బంది అందరూ వారి వారి ఏరియాల్లో వారికి కేటాయించిన పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లో వారి షెడ్యూల్ ఆధారంగా తప్పకుండా విజిట్ చేయాలన్నారు. అలాగే పాఠశాల, అంగన్ వాడీ విద్యార్థులందరిని పరీక్షించాలని, అవసరమైన వారిని డిఈఐసి కేంద్రానికి రిఫర్ చేయాలన్నారు. సీపీఆర్ శిక్షణను డాక్టర్ వెంకటేష్, వేణుగోపాల్ ఇవ్వడంతో పాటు అన్ని టీంల అభ్యర్థుల చేత సీపీఆర్ చేసే విధానంపై ప్రాక్టిస్ చేయించారు.

 

Students should be made aware of CPR.

 

శిక్షణ అనంతరం వారికి కేటాయించిన విధులకు సంబంధించి సమీక్షను డాక్టర్ బి రాజశ్రీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అరవింద్, డాక్టర్ విజయభాస్కర్, డి హెచ్ఈలు వేణుగోపాల్, ఘనపూర్ వెంకటేశ్వర్లు , వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Students should be made aware of CPR.