Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 5:35 pm Posted by : ramakrishna

విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో తెలపాలి

 

. . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో తెలపాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా బుక్ పట్టుకొని, చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన 26.674 వేల కోట్ల రూపాయలు 8.22% విద్యారంగానికి ఏ మాత్రం సరిపోని విధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు విద్యారంగం పూర్తిస్థాయి అభివృద్ధి కి దోహదపడుతామని అన్నారు. కానీ విద్యారంగానికి ఎటు సరిపోకుండా బడ్జెట్  కేటాయించడం సిగ్గు చేటని విద్యా, వైద్యానికి నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దాంతో పాటు ప్రభుత్వ బడులలో, సంక్షేమ హాస్టల్ లలో, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిలలో అభివృద్ధికి ఈ నిధులు ఏమాత్రం సరిపోదని, ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం విద్యా రంగం పైనా దృష్టి మాత్రం పెట్టడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేముందు విద్యారంగానికి సంబంధించి మేధావులతో, అదే విధంగా విద్యార్థి సంఘాలతో చర్చించి బడ్జెట్లను ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుశాల్ దేవ్, నాయకులు రంజిత్, శివ, కమల్, ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.

 

Students should be informed about how infrastructure facilities will be provided.