విద్యార్థులను గురుకులాల్లో చేర్పించాలి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురుకులాలు, కేజీబీవి, ప్రైవేట్, మోడల్ స్కూల్స్ 5వ తరగతి బాలబాలికలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2025 పై భిక్కనూరు గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సాంఘిక గురుకుల ప్రిన్సిపాల్ రఘు మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల విద్యకై ...