Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 8:29 pm Posted by : ramakrishna

విద్యార్థులను గురుకులాల్లో చేర్పించాలి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురుకులాలు, కేజీబీవి, ప్రైవేట్, మోడల్ స్కూల్స్ 5వ తరగతి బాలబాలికలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2025 పై భిక్కనూరు గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సాంఘిక గురుకుల ప్రిన్సిపాల్  రఘు మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని  తెలిపారు.  విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల విద్యకై  5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు టిజిటిడబ్ల్యూఆర్ ఈఐఎస్ ఖమ్మం, పరిగి ఎస్ఓఈలలో 8వ తరగతి ప్రవేశాలు, టీజీఎస్ డబ్ల్యుఆర్ ఈఐఎస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం, రామ్ శంకర్, సిబ్బంది శంకర్, సిద్ది రామేశ్వర నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కల్పన మరియు ఉపాధ్యాయురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.