Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 4:57 pm Posted by : ramakrishna

బకాయిల భారం నుండి విద్యార్థులను ఆదుకోవాలి

  • ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8200 కోట్లు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ పేద విద్యార్థులను ఆదుకోవాలని ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ షాపులలో దుకాణంలో బిక్షటణ చేయడం జరిగింది. గత మూడు 4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు అందించడంలో గతంలో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని చదువులు పూర్తి అయిన సర్టిఫికెట్లు పొందాలంటే పెండింగ్ బకాయిలు చెల్లించి తమ సర్టిఫికెట్లను తీసుకువెళ్లాలని విద్యార్థులకు ప్రవేట్ ప్రభుత్వ విద్య సంస్థల యాజమాన్యాలు చెప్పడంతో పేద విద్యార్థులు అయ్యోమాయనకి గురవుతున్నారు. పై చదువులు చదవాలంటే చదువులు సాగేదెట్లా ఒకవైపు బి.ఎ.స్ పాఠశాలలో అనుమతించక పోవడంతో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు జగిత్యాలలో రోడ్డు ఎక్కిన వైనం ప్రభుత్వానికి కనబడడం లేదా ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై విద్యా సంస్థలకు ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కుషాల్ ,సుభొద్,సంజయ్, కార్తీక్ పాల్గొన్నారు.

Students should be helped from the burden of arrears.