Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 7:26 pm Posted by : ramakrishna

విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కాకతీయ విద్యాసంస్థల అధ్యాపక, ఉపాధ్యాయులకు సోమవారం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పై అవగాహన  సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు. అహర్నిశలు ఆధునిక సమాజానికి కావలసిన విద్యను అభ్యసిస్తూ, విద్యార్థులను భవిష్యత్ దిశగా శిక్షణ అందించాలని కోరారు.  విద్యార్థులకు  అకుంఠిత భావంతో విద్యను అందించాలని, విద్యార్థులు కూడా పూర్తి శ్రద్ధతో విద్యను అభ్యసించాలని తెలిపారు. కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజినీకాంత్ మాట్లాడుతూ మార్చి నెలలో వచ్చే టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి నిబద్ధత  జరగాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కి తావు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డిని కోరారు. ఇప్పుడు వచ్చేది ఎగ్జామ్ టైం కాబట్టి విద్యార్థులందరూ పూర్తిగా శిక్షణ పొంది మాత్రమే ఎగ్జామ్స్ రాయాలని, ఎవరు కాపీలపై ఆధార పడవద్దని సూచించారు. సాధారణ విద్యతో పాటు నైపుణ్య విద్యను కూడా నేర్చుకోవాలని, తల్లిదండ్రులకు చేదోడు బాదోడుగా ఉండడానికి నైపుణ్య విద్య ఎంతో తోడ్పడుతుందని అన్నారు.  ఈ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్  రజనీకాంత్,  ప్రిన్సిపల్ ఎండీ ఫరీదుద్దీన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశ వేణు, అగ్రికల్చర్ బోర్డ్ మెంబర్ గడుగు గంగాధర్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాకతీయ అధ్యాపక, ఉపాధ్యాయులు ,సిబ్బంది పాల్గొన్నారు.