విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : విద్యార్థినీలు అపరిచిత వ్యక్తులతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు  సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు షీ టీం తదితరాంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎస్ఐ మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులలో బావులు, చెరువులు, నదులలోకి సరదాగా...