Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 8:54 pm Posted by : ramakrishna

విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : విద్యార్థినీలు అపరిచిత వ్యక్తులతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు  సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు షీ టీం తదితరాంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎస్ఐ మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులలో బావులు, చెరువులు, నదులలోకి సరదాగా ఈత కోసం వెళ్లి ప్రాణాల మీదికి కొని తెచ్చుకోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఆడపిల్లలను తాకరాని చోట తాకితే తమ తల్లిదండ్రులకు, షీ టీం సభ్యులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్ ఫోన్లు వాడే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థినిలకు ఏమైనా సమస్యలు ఎదురైతే షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు, ఈ అవగాహన కార్యక్రమంలో షీ టీం బృందం, ఆంటీ ఉమెన్ ట్రాఫికింగ్ , భరోసా టీం, కళాబృందం సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ గీత, ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు  పాల్గొన్నారు.