Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 8:50 pm Posted by : ramakrishna

సమాజం పట్ల అవగాహనతో విద్యార్థులు మెలగాలి 

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడారు.  సమాజంలో జరుగుతున్న విధి విధానాలను, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ క్రైమ్ మోసాలు, మత్తు పదార్థాలు వంటి అనారోగ్యకరమైన ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. వీటిపై విద్యార్థులు అప్రమత్తంగా మెలగాలన్నారు. మీ భవిష్యత్తు మీరే బాధ్యతగా నిలిచి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు. చదువు అనేది ఎంత ముఖ్యమో సమాజం పై అవగాహన కూడా అంతే ముఖ్యం అని అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతలు మంచి విలువలు నేర్చుకొని ఉన్నంత స్థానాలకు ఎదగాలని మీ తల్లిదండ్రుల కలల సహకారంలో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం, ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.