Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 8:47 pm Posted by : ramakrishna

ఈవ్ టిజింగ్ , సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

 

మద్నూర్, బతుకమ్మ:

మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలోని మోడల్ స్కూల్లో మంగళవారం పోలీసు శాఖ షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. షీటీమ్ సభ్యులు అనిల్, ప్రియాంక  మాట్లాడుతూ..  ఈవ్ టిజింగ్ కు పాల్పడితే  చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు కలిసి మెలిసి ఉండాలని వేదింపులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్ధని అన్నారు. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ పోన్ లు ఉన్నాయని అందువలన సైబర్ నేరస్తులు ప్రజలను లింక్ లు పంపి బురిడి కోట్టించే అవకాశం ఉందన్నారు. స్మార్ట్ పోన్ లకు అపరిచితులు పంపే లింక్ లకు ఓటిపిలు చెప్ప వద్ధని అన్నారు. అపరిచితులకు పోన్ లు, ఖాతాల వివరాలు ఇచ్చిన నేరమేనని అన్నారు.సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Students should be aware of eve teasing and cybercrime