Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 8:06 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

  • ఉపాధ్యాయుల  బడిబాట కార్యక్రమం

 

నందిపేట్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన బడిబాట,  పీఠిఎం కార్యక్రమం శుక్రవారం ఐలాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ పథక కేంద్రంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 121 మంది గ్రామస్థులు హాజరయ్యారు. పాఠశాల హెడ్మాస్టర్ లాలయ్య మాట్లాడుతూ ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనేక వసతులు కల్పించబడుతున్నాయని, ఇటీవల పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సాయికుమార్, వీడీసీ చైర్మన్ గంగాధర్, క్యాషియర్, అకౌంటెంట్, ఫీల్డ్ ఆఫీసర్, ఉపాధ్యాయ బృందం సభ్యులు మురళీ, సాయన్న, గిరి, విష్ణువర్ధన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.