అనుమతులు కలిగిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి

విద్యాధికారి నాగేశ్వరరావు   బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని అనుమతులు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించవద్దని బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు. బాన్సువాడ మండలంలో 20 ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతి లేకుండా పలు పాఠశాలలు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. నూతనంగా ప్రారంభించే పాఠశాలలు, పాఠశాల బోర్డులు ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాన్సువాడ పట్టణంలో శ్రీ...