విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

బతుకమ్మ, కమ్మర్ పల్లి :  విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఉంటేనే విజయం సాధించినట్లు అవుతుందని కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండలం కోనాసమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం శనివారం రోజున నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ తీసుకొని జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన...