Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 6:18 pm Posted by : ramakrishna

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

బతుకమ్మ, కమ్మర్ పల్లి :  విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఉంటేనే విజయం సాధించినట్లు అవుతుందని కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండలం కోనాసమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం శనివారం రోజున నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ తీసుకొని జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థినులపై వేధింపులు,మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీం కాల్ సెంటర్ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, ప్రధానోపాధ్యాయులు మధుపాల్,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నస్రిన్,షీ టీం సభ్యులు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Students should avoid bad habits