విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర 23వ మహాసభను నగర కమిటీ ఆధ్వర్యంలో  కోటగల్లిలోని జేసిఎస్ ప్రసాద్ భవన్ లో నిర్వహించారు. పీడీఎస్యూ బిగిపిడికిలి జెండాను నగర అధ్యక్షులు ఎస్కే.అషూర్ ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్యవక్తగా హాజరైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ  ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశంలో కుల, మతోన్మాదాలు పెచ్చరిల్లుతున్నాయన్నారు. పాలకవర్గాలే ప్రజల్ని విభజించి పాలిస్తున్నాయన్నారు. కులమత విద్వేషాలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం...