Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 6:37 pm Posted by : ramakrishna

విద్యార్థుల పొలంబాట

  • – నాట్లు వేసి… అన్నదాతలకు సన్మానం
    – జాతీయ రైతు దినోత్సవ వేడుకలు
    బతుకమ్మ, నవీపేట్ : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు పంట పొలాలకు వెళ్లి నాట్లు వేస్తున్న రైతు కూలీలకు , రైతులకు శాలువా కప్పి పుష్పాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు నారు ను మోసి నాట్లు వేశారు.
  • Students' row
  • ఈ సందర్భంగా వ్యవసాయ పద్ధతులు, నారు మడి, నాట్లు, ఎరువులు, కలుపు, కోతలు, వరి లో రకాలు, సాగుబడి, రైతుల సాగు కష్టాలు, తదితర వ్యవసాయ సంబంధ విషయాలు స్థానిక రైతులు మోస్రా సాయిరెడ్డి, కోట్ రెడ్డి, సతీష్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిరెడ్డి, సుధారాణి, లక్ష్మి, గణేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
  • Students' row