Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 5:20 pm Posted by : ramakrishna

సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

  • హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రమేష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసమానతలు కలిగిన సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకం అని, విద్యార్థులు లేని ఏ పోరాటం విజయవంతం కాలేదు అని హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రమేష్ అన్నారు. అందుకే అసమానతలు కలిగిన సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి.రమేష్ అన్నారు.  నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యూ  నిజామాబాద్ నగర 23 వ మహాసభ  జిల్లా కేంద్రంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు.  మొదటగా బిగిపిడికిలి జెండాను నగర అధ్యక్షులు జే.సాయికృష్ణ ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి.రమేష్  మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంలో కల్పించిన  హక్కులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల్లో  విద్య హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని, విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులను నియంత్రించడని ఫీజుల నియాత్రణ చట్టం తీసుకురావాలని  డిమాండ్ చేశారు. జిల్లా పి డి ఎస్ యూ అధ్యక్షులు గౌతం కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో  విద్యకు ప్రతీ ఏటా నిధులు తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను నిర్విన్యం చేస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకపోవటం వలన  పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్స్ కు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని మహాసభలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర నాయకులు నిఖిల్, మనోజ్, పవన్, సాయి కిరణ్, ప్రసాద్, భవాని, ప్రసాద్, ముక్తా శ్రీ. ప్రజా సంఘాల నాయకులు సాయి రెడ్డి, నాతన్, శివకుమార్, తదితదిరులు పాల్గొన్నారు.

Students need to participate in social change