విద్యార్థులు లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   రుద్రూర్, బతుకమ్మ: విద్యార్థులు లక్ష్యాన్ని నెరవేర్చుకొని చదవాలని  రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ  నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గ్రామ శివారులో గల ఆదర్శ పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వసతిగృహ  వార్డెన్ కు సూచించారు. అదేవిధంగా విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాన్ని నెరవేర్చుకోని కష్టపడి చదివి ఉన్నత...