Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 12:57 pm Posted by : ramakrishna

జార్జి రెడ్డి నీ స్మరిస్తూ విద్యార్థుల మార్నింగ్ వాక్

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్న భూస్వామ్య , నిచ్చెన మెట్ల ఆధిపత్య వ్యవస్థను వ్యతిరేకించి , ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ నిర్మూలనకు కామ్రేడ్ జార్జి రెడ్డి ప్రత్యేక కృషి  చేశారని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. పి డి ఎస్ యు వ్యవస్థాపకుడు, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి 54 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరం వినాయక నగర్ లో  మార్నింగ్ వాక్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రగతి శీల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాడని, గొప్ప మేధావి , విద్యారంగ సమస్యల పరిష్కారమే కాకుండా సమాజంలో అంతరాలు లేని సమ సమాజం కోరుకున్నారని,నేడు దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని,ఒకే దేశం ఒకే విద్యా పేరుతో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు విద్యను కాషాయీకరించే పాలసీలను తీసుకువస్తున్నారని, పేద బడుగు బలహీన మరియు మైనార్టీ వర్గాలకు స్కాలర్షిప్ లు  నిలిపివేశారని, విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జి రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నగర కోశాధికారి ప్రసాద్, నగర కమిటీ సభ్యులు దత్తాత్రేయ,శ్రీకర్, క్రిష్, సాయినాథ్ , రాజశేఖర్, సాయి కిరణ్,సిర్రం గంగా సోనీ,నవ్య,సమీక్ష,పవిత్ర,కావ్య,అశ్వినీ, స్వప్న,భార్గవి,అనూష, అంకిత,స్వవని, తదితరులు పాల్గొన్నారు.