విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
. పెద్ద కొడప్ గల్ ఎస్సీ బాలుర హాస్టల్ లో నలుగురు విద్యార్థులకు అస్వస్థత . ఇద్దరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలింపు . వార్డెన్ ను బదిలీ చేసి చేతులు దులుపుకున్న అధికారులు కామారెడ్డి, బతుకమ్మ: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పెద్ద కొడప్ గల్ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు నలుగురు గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు....