మద్నూర్, బతుకమ్మ : మద్నూర్ మండలం ఆవల్ గావ్ గ్రామానికి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆవల్ గావ్ గ్రామం నుంచి మద్నూర్ మండల కేంద్రానికి పలువురు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవడానికి విద్యార్థులు ఆటోలో వెళ్తుంటారు. మార్గమధ్యలో ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను స్థానికులు మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు.