Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 9:36 pm Posted by : ramakrishna

డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులకు లబ్ది

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి

మోపాల్, బతుకమ్మ : ప్రభుత్వం చేపట్టిన కామన్ డైట్ మెనూ, కాస్మొటిక్ ఛార్జీల పెంపుతో పేద విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి అన్నారు. మోపాల్ మండలంలోని కంజర గ్రామంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర సంక్షేమ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చార్జీల పెంపు వల్ల పేదవిద్యార్థులకు లబ్ది చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు బాగా  చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల ఎంపీడీఓ రాములు నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.