Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 2:13 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా సిగ్నల్ వద్ద వద్ద ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై స్కూల్ విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్ట్స్ తో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ కు సంబంధించిన సిగ్నల్స్ మరియు జీబ్రా లైన్ పాటించాలని, మైనర్లు,  డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనం నడుపుట చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు.  మైనర్లకు బండి ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని,   ద్విచక్రవాహనదారులు  హెల్మెట్ ధరించాలని,  కారు నడిపే వారు  సీట్ బెల్ట్ ధరించాలని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు..