Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 6:03 pm Posted by : ramakrishna

కిచెన్ గార్డెన్ పై విద్యార్థులకు అవగాహన

మోర్తాడ్, బతుకమ్మ: ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ ఎరువులతో కూరగాయలు పండించిన కూరగాయలు తినడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వయంగా సహజ సిద్ధమైన ఎరువులతో టమాటా, వంకాయ, చిక్కుడుకాయ, మిరపకాయ, మెంతేమ్, కొత్తిమీర, బెండకాయ, బీరకాయ, కాకర కాయ తదితర పండిస్తున్నారు. రసాయన ఎరువులు వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సహజ ఎరువుల ద్వారా కూరగాయలు పెంచడం వల్ల వాటిని తినడం వల్ల కలిగే లాభాలను గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Students' awareness about kitchen garden