Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2024, 7:26 pm Posted by : ramakrishna

హస్టల్ బిల్డింగ్ మార్చాలని విద్యార్ధులు తల్లిధండ్రుల రస్తారోకో

బతుకమ్మ, బిబీపేట్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రంలో జ్యోతిబాపూలే బిసీ హస్టల్ లో సమస్యలను పరిష్కరించకపోవడంతో విద్యార్థులతో కలిసి తల్లిధండ్రులు రోడేక్కారు. హస్టల్ భవనంను మార్చాలని కోరుతు అదివారం బిబీపేట్ బాయ్స్ హస్టల్ ముందు రోడ్డుపై రస్తారోకో చేశారు. వాహనాలు వెల్లకుండా రోడ్డుకు అడ్డుగా పడుకోని నిరసన తెలిపారు. పిల్లలు ఉండే హస్టల్ లో చాల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని అధికారులను కోరిన స్పంధన లేదని తల్లిదండ్రులు వాపోయారు.ఇది వరకు అధికారులకు హస్టల్ భవనంను మార్చాలని కోరిన స్పంధన లేదని వాపోయారు. విద్యార్థులు తల్లిధండ్రులు రస్తారోకొతో వాహనాలు నిలిచిపోయాయి. పోలిస్ లు, స్థానిక అధికారులు వచ్చి సమస్యను అధికారులకు ధ్రుష్టికి తీసుకువేల్తామని హమీ ఇచ్చి ఆందోళన విరమింప చేశారు.