ఎమ్మెల్యే మదన్ మోహన్ కు విద్యార్థుల కృతజ్ఞతలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కుమంగళవారం లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం...