Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 8:20 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు విద్యార్థుల కృతజ్ఞతలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కుమంగళవారం లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను  ఎమ్మెల్యే సందర్శించారు.  అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రెండవ విడత లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మంజూరు చేయాలనీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కోరినట్టు తెలిపారు.

Students are thankful to MLA Madan Mohan