బతుకమ్మ,ఏర్గట్ల: గుమ్మి ర్యాల గ్రామంలో మంగళవారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో ముక్కెర దేవన్న యాదవ్ తల్లి మరణించడం జరిగింది. ఆయన తల్లి ముక్కెర గౌరమ్మ వర్ధంతి సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు, అంగన్ వాడి స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు,పెన్నులు,నోట్ బుక్ లు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో ముక్కెర దేవన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గౌరమ్మ జ్ఞాపకార్థంగా గుమ్మిర్యాల గ్రామంలో శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో క్యాతం సుభాష్ రెడ్డి,ముక్కెర మల్లేష్ , ప్రసాద్ , గజేందర్, ప్రవీణ్, శ్రీనివాస్,మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు,యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యానంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, గౌతమి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.