Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 5:14 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేజీబీవీ స్కూల్ ను మంగళవారం రోజున పి హెచ్ సి డాక్టర్ ప్రసన్న ప్రియా సందర్శించారు. స్కూల్ పిల్లలకు సీజనల్ వ్యాధుల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యరీత్యా సిక్ అయినా స్కూలు పిల్లలకు మెడిసిన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ పరిసరాలను, వంట గదిని, బాత్ రూములను పరిశీలించి క్లీన్ గా ఉండేటట్లు చూసుకునగలరని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో కేజీబీవీ స్కూల్ ఎస్ ఓ సంధ్య,హెచ్ ఇ ఓ లింభారెడ్డి,మోతిరామ్,పి హెచ్ ఎం ఇందిర,ఏఎన్ఎం కల్పన, త్రివేణి,కేజీబీవీ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.