Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 7:20 pm Posted by : ramakrishna

విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో  బేసిక్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఏటీఎం నెంబర్ గాని, పాస్వర్డ్ గానీ, ఓటిపి నంబర్లు గాని చెప్పవద్దన్నారు. అనవసరమైన లింకులను ఓపెన్ చేసి ఇబ్బందులకు గురికావద్దన్నారు. గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని  సూచించారు. విద్యార్థులు తమ తమ గ్రామాలలోని ప్రజలకు మాదకద్రవ్యాల గురించి అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.