Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 7:51 pm Posted by : ramakrishna

జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను సన్మానించిన విద్యార్థులు, యువజన నాయకులు

బోధన్, బతుకమ్మ :  జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని బోధన్ లోని విద్యార్థులు, కాంగ్రెస్ యువజన నాయకులు గురువారం ఘనంగా సన్మానించారు. పదవి చేపట్టి కొద్ది రోజుల్లోనే బోధన్ పట్టణ గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు కావాల్సిన కుర్చీలు, టేబుల్స్, ఫ్యాన్స్ అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం అవసరమగు పుస్తకాలను అందుబాటులోకి తేవడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేసినందుకు గాను గురువారం  గ్రంథాలయ చైర్మన్,  మున్సిపల్ చైర్మన్ తూము శరత్ రెడ్డిని విద్యార్థులు, కాంగ్రెస్ యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు దొడ్ల రవీందర్, పట్టణ యూత్ అధ్యక్షుడు తెల్లారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.