Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 11:22 am Posted by : ramakrishna

బోధన్‌ బాలికల గురుకులంలో విద్యార్థుల ఆందోళన

బోధన్, బతుకమ్మ :

 

బోధన్‌ బాలికల గురుకులంలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయురాలు వేధిస్తున్నారని విద్యార్థినులు గురుకులం ఆవరణలో గురువారం నిరసన కు దిగారు.టీజీఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ (బాలికలు)లో పీజీటీ ఇంగ్లీష్ టీచర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మాస్తి, సిగ్గులు లేవు, పనికిమాలిన మంద, కుక్క జాతి, బర్రె జాతి” అంటూ దూషణలు చేసిందని విద్యార్థినిలు తెలిపారు.విద్యార్థినులపై మానసిక వేధింపులు చేస్తుందని, స్టాఫ్ ముందే అవమానకరంగా మాట్లాడుతుంద న్నారు. 10వ తరగతి, ఇంటర్ బాలికలపై ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రోడ్డెక్కి ధర్నాకు ప్రయత్నించిన విద్యార్థినులను యాజమాన్యం అడ్డుకున్నారు. ఉపాధ్యాయురాలి పైసమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు.

Students' agitation at Likala Gurukulam