విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ ఆవిష్కరణ
కామారెడ్డి, బతుకమ్మ : కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పరీక్షకు సంబందించిన బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణ వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులు పరిశోధన మరియు ప్రయోగాల్లో రాణించేలా విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్ష నిర్వహిస్తుంది....