Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 6:52 pm Posted by : ramakrishna

విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ ఆవిష్కరణ

కామారెడ్డి, బతుకమ్మ : కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్  ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి  ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్ మంతన్  పరీక్షకు సంబందించిన బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థులలో దాగి ఉన్న  సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణ వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.  విద్యార్థులు పరిశోధన మరియు ప్రయోగాల్లో రాణించేలా  విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్ష నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిభ పరీక్షను ఎన్సీఈర్టీ, ఎన్సీఎస్ఎం, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిభ పరీక్షకు దేశంలోని ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న వారికి ఈ పరీక్షకు అవకాశం ఉందని ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఇంటర్న్షిప్ ,స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్  పాల్గొన్నారు.