గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు

నసురుల్లాబాద్, బతుకమ్మ : నసుర్లలాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న  భోజనాన్ని వసతులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని  ప్రతిరోజు అందించాలని వివరించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వారి ఆరోగ్యం పట్ల...