Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:27 pm Posted by : ramakrishna

గురుకులంలో జరిగిన విషాదానికి విద్యార్థి సంఘ నాయకుల నిరసన.

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేస్తుండగా, 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఆటో నుంచి బెంచీలు దించుతుండగా అవి తలకు తగలడంతో తీవ్ర గాయాలైన ఆమెను బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. విద్యార్థి మృతి పట్ల బిజెపి, బిఆర్ఎస్ పార్టీ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని తెలియజేశారు. బాన్సువాడ మెయిన్ రోడ్డు పై ధర్నా చేస్తూ కలెక్టర్  రావాలని తగిన న్యాయం చేయాలని నిరసన తెలిపారు.