. . . గురుకుల, సంక్షేమ, కేజీబీవీ హాస్టల్లలో సైకాలాజిస్టులను వెంటనే నియమించాలి
. . . ఏఐఎస్ బి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల, సంక్షేమ, కేజీబీవీ హాస్టల్లలో ఉన్న విద్యార్థినుల ఆత్మహత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రి లేరని ఆయన విమర్శించారు. గురుకుల, సంక్షేమ, కేజీబీవీ హాస్టళ్ల నిర్వహణలో పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు. ప్రతి గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లలో, కేజీబీవీల్లలో ప్రెండ్లీ నేచర్ కల్పించాలని, అలాగే సైకాలజిస్టులను వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోదైర్యాన్ని కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టవద్దని ఆయనన్నారు.