పాఠశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లోని కాకతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి భవనం నుంచి దూకాడు. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ కు చెందిన విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలలో పరీక్షల సందర్భంగా కాపీ కొడుతుండగా ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరీక్షల అనంతరం విద్యార్థి మూడవ అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో విద్యార్థి కాలువిరిగి తీవ్ర గాయాలయ్యాయి....