బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని తిమ్మా నగర్ గ్రామపంచాయతీ పరిధిలో తండాలో గణపతిని మండపం ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి తండాలోని విద్యార్థులు గణపతి మండపం వద్ద ఆటలాడుకొని అక్కడే నిద్రించారు. గణపతి మండపం వద్ద నిర్దిస్తున్న విశాల్ (15 )పాము కరవడంతో రాత్రి మూడు గంటల సమయంలో వాంతులు చేశారని తండావాసులు తెలిపారు. విద్యార్థిని బాన్సువాడ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. విద్యార్థికి పాము కాటు వేసిందని డాక్టర్లు తెలపడంతో తల్లిదండ్రులు లబోదిబోమనిరోధించారు. విద్యార్థి నసల్రాబాద్ గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. మండపం దగ్గర చనిపోవడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.