. . . వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న విద్యార్థి హఠాన్మరణం
. . . దేవి తండాలో విషాదం
ఇందల్వాయి, బతుకమ్మ :
వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న విద్యార్థి పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఆదివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిలోని దేవి గాడ్ తాండ పంచాయతీ పరిధిలో జరిగింది. దేవిగాడ్ తండాకు చెందిన బాదావత్ చరణ్(18) వ్యవసాయ పొలం వద్దే ప్రాణాలు కోల్పోయాడానీ ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలత తెలిపారు. స్థానికులు, ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం కావడంతో తన సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన చరణ్ అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగులు తోడు కావడంతో విద్యార్థి చరణ్ వ్యవసాయ క్షేత్రంలోనే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చరణ్ ను హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మార్చూరికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుమలత తెలిపారు.